రాష్ట్ర Congress Party లో కొనసాగుతున్న ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేక, తీవ్ర మానసిక వ్యధ, ఆందోళన, బాధాతప్త హృదయముతో ఈ లేఖ రాస్తున్నందుకు విచారిస్తున్నాను.

ఆనాడు 31st October 1984 ఈ దేశ సమగ్రత, సమైక్యతకు తన ప్రాణాలను త్యాగం చేసిన స్వర్గీయ ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా, యువతకు స్ఫూర్తిగా, నీతి, నిజాయితీ, నైతిక విలువలకు కట్టుబడేవిధంగా Congress పార్టీని తీర్చిదిద్దాలనే ఆలోచనతో శ్రీయుత Sri. Rajeev Gandhi గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, బాధ్యతలు చేపట్టగా, వారి నాయకత్వంలో Congress Party లో చేరి ఆనాటి నుండి ఈనాటి వరకు క్రమశిక్షణ గల కార్యకర్తగా వివిధ దశల్లో Congress Party బలోపేతం కొరకు పాటుపడటంలో భాగంగా, JAGTIAL శాసన సభ స్థానం నుండి, Congress Party అభ్యర్థిగా 5 పర్యాయాలు శాసన సభ సభ్యుడిగా గెలవడంతోపాటు Telangana రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ తీవ్రతలో అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా 2006 మరియు 2008 రెండు పర్యాయాలు Karimnagar పార్లమెంట్ ఉప ఎన్నికల్లో T.R.S Party అధ్యక్షుడైన K.C.R. గారిపైన Congress పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం రెండవ పర్యాయం 2008లో కేవలం 14000 వేల ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోయిన విషయం విదితమే.
Telangana రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి తొలి రాష్ట్ర శాసన సభ ఎన్నికలు 2014లో ఉమ్మడి Karimnagar జిల్లా నుండి ఏకైక Congress Party అభ్యర్థిగా గెలవడంతోపాటు, అప్పటి 2014 శాసన సభ ఎన్నికల్లో ఉత్తర Telangana కు సంబంధించిన, Adilabad, Nizamabad, Karimnagar మూడు జిల్లాలకుగాను, Congress Party Adilabad జిల్లా నుండి కేవలం Mudhol శాసన సభ నియోజకవర్గం నుండి Vithal Reddy గారు మరియు Karimnagar జిల్లా నుండి JAGTIAL Assembly స్థానం నుండి నేను మాత్రం గెలువగా, Adilabad జిల్లా Mudhol శాసన సభ స్థానం నుండి గెలిచిన Vithal Reddy గారు T.R.S Partyలో చేరగా, ఉత్తర Telangana Adilabad(10), Nizamabad(9), Karimnagar(13) మొత్తం(32) శాసన సభ స్థానాలకుగాను ఏకైక Congress Party ప్రతినిధిగా, 5 సంవత్సరాల కాలం T.R.S పార్టీ K.C.R. గారి నియంతృత్వ ధోరణి, అప్రజాస్వామిక కుటుంబ పాలనను, శాసన సభలలో, మరియు ప్రజాక్షేత్రంలో ఎదిరించి, పోరాటం చేసిన విషయం తెలియంది కాదు.
చివరకు 2018 శాసన సభ ఎన్నికలలో నేను ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ, వెనువెంటనే వచ్చిన ఉత్తర Telangana ఉమ్మడి Adilabad, Nizamabad, Karimnagar మరియు Medak జిల్లాల పట్టభద్రుల(Graduate) నియోజకవర్గం నుండి Congress Party అభ్యర్థిగా మొదటి లెక్కింపులోనే ఎంపిక కాబడి, గడిచిన 5 సంవత్సరాల కాలం శాసన మండలిలో ఏకైక సభ్యుడిగా, T.R.S పార్టీ నియంతృత్వ అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎదిరించి T.R.S ప్రభుత్వాన్ని నిలదీయడంతోపాటు, Telangana రాష్ట్ర స్థాయిలో పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన 42 శాసన సభ నియోజకవర్గాల పరిధితోపాటు, శాసన మండలిలో Congress Party పక్షనేతగా రాష్ట్ర స్థాయిలో Congress పార్టీ బలోపేతానికి, కృషి చేసినప్పటికీ, మొన్నటి 2023 శాసన సభ ఎన్నికల్లో JAGTIAL నియోజకవర్గం నుండి, ఆశించిన ఫలితం పొందలేకపోవటం కొంత నిరాశకులోనుకావటం జరిగిందని చెప్పకతప్పదు.
అయినప్పటికీ, ఏవిధమైన నిరాశకు లోనయినట్లు భావించకుండా రాష్ట్రంలో అఖిల భారత స్థాయిలో Telangana రాష్ట్రాన్ని ఇచ్చిన Smt. Sonia Gandhi నాయకత్వంతోపాటు BHARATH JHODO YATHRA తో యావత్ భారత దేశంలో Congress పార్టీ బలోపేతం కొరకు, పాదయాత్ర చేపట్టిన Sri. Rahul Gandhi గారి నాయకత్వంలో Telangana రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావటం మరియు A.I.C.C. అధ్యక్షులుగా Sri. Mallikarjuna Kharge గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో Congress Party ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతో గౌరవ A. Revanth Reddy గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి, రాష్ట్రంలో ముఖ్యంగా, ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలు, ప్రజాహిత కార్యక్రమాల అమలుకు శాసన మండలి సభ్యునిగా నా వంతు బాధ్యతగా పనిచేస్తున్న సందర్భంలో, రాష్ట్ర Congress Party గత నాలుగు దశాబ్దాలుగా, JAGTIAL శాసన సభ నియోజకవర్గంలో నాకు ఉన్న అనుబంధాన్ని పరిగణలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా, ఏ Party ఫిరాయింపులను నిలువరించబడేవిధంగా, ఆనాడు 1985లో Sri. Rajeev Gandhi గారు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపందించి అమలుకు చర్యలు చేపట్టినప్పటికీ కూడా, అందులో ఉన్న లోసుగులను ఆసరాగా చేసుకొని, చట్టసభలకు ఎన్నికైన సభ్యులు పార్టీ ఫిరాయింపులను కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ఇట్టి పార్టీ ఫిరాయింపులను పూర్తిస్థాయిలో నిలువరించబడేవిధంగా Sri. Rahul Gandhi గారు Panch Nyay లో భాగంగా, చట్ట సభలకు ఎంపికైన ఎవరైనా సభ్యుడు పార్టీ ఫిరాయింపునకు పాల్పడినచో, వారి సభ్యత్వం తక్షణమే రద్దు చేయబడేవిధంగా రాజ్యాంగం 10th Schedule లో మార్పు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్న విషయాన్ని విస్మరించి, JAGTIAL శాసన సభ నుండి B.R.S. అభ్యర్థిగా ఎంపికైన M. Sanjay Kumar గారిని Congress పార్టీలో కలుపుకున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి A. Revanth Reddy గారు ప్రకటించటంతో, జీర్ణించుకోలేక, మానసిక ఆవేదన, వ్యధతో నా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయవలెనని భావించిన పరిస్థితుల్లో, గౌరవ ఉప ముఖ్యమంత్రి Sri. Bhatti Vikramarka గారు మరియు గౌరవ మంత్రివర్యులు Duddilla Sridhar Babu గారు నాకు జరిగిన అవమానం, అగౌరవాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి తగువిధంగా, నా గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం జరుగుతుందని పేర్కొనటం, మరుసటి దినం, A.I.C.C. Incharge General Secretary K.C. Venu Gopal Garu మరియు Telangana State Incharge గౌరవ Deepa Das Munshi గారు పార్టీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించి, Congress పార్టీలో నా గౌరవానికి ఏవిధమైన భంగం వాటిల్లకుండ, నా గౌరవాన్ని నిలబెట్టే చర్యలు చేపట్టడము జరుగుతుందని పేర్కొనటం, నాకు గత నాలుగు దశాబ్దాలకాలంలో Congress Party తో ఉన్న అనుబంధంతోపాటు, Congress Party అధినాయకత్వం పట్ల గౌరవంతో, నా బాధను దిగమింగుకొని, ఓర్పు వహించటం జరిగింది.

కాని తిరిగి ఈ మధ్య Congress పార్టీలో జరుగుతున్న పరిణామాలు Congress Party లోకి ఫిరాయించిన శాసన సభ్యులకు, ప్రత్యేక గుర్తింపు ఇవ్వబడుతుందనే అభిప్రాయాన్ని కలిగించేవిధంగా, ఆనాడు T.R.S ప్రభుత్వ హయాంలో Congress Partyని బలహీన పర్చటంలో భాగంగా Congress Party శాసనసభ నాయకత్వం Leader of Opposition Party గుర్తింపు కోల్పోయేవిధంగా గౌరవ Sri. Bhatti Vikramarka గారిని తొలగింపచేయటంలో తనవంతు పాత్ర పోషించిన Pocharam Srinivas Reddy గారి ఆధ్వర్యంలో, పార్టీ ఫిరాయింపుదారులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి, అట్టి సమావేశానికి, గౌరవ ముఖ్యమంత్రి A. Revanth Reddy గారితోపాటు, Telangana Congress Party వ్యవహారాలను A.I.C.C. పక్షాన బాధ్యతలు నిర్వహిస్తున్న Incharge Secretary Smt. Deepa Das Munshi గారు కూడా హాజరై ఫిరాయింపుదారులకు వారి, వారి శాసన సభ నియోజకవర్గాల్లో ప్రభుత్వపరంగానే కాకుండా, Congress Party పరంగా కూడా, భవిష్యత్ లో వారికే పూర్తి బాధ్యతలు అప్పగించేవిధంగా, పేర్కొనటంతో దశాబ్దాల తరబడి, క్రమశిక్షణ గల Congress కార్యకర్తగా, గత దశాబ్దకాలంలో రాష్ట్రంలో T.R.S.(B.R.S.) ప్రభుత్వ అరాచకాలను, దౌర్జన్యాలను ఎదిరిస్తూ Congress Party బలోపేతానికి కృషి చేసిన Maru Ganga Reddy Ex.M.P.T.C. గారిని నిన్నటి రోజు అనగా 22-10-2024 ఉదయం 7-30 గంటల ప్రాంతంలో ఈ మధ్య కాలంలో Congress లో చేరినట్లు ప్రకటించుకున్న B.R.S. పార్టీపై ఎన్నికైన JAGTIAL శాసనసభ సభ్యుడు M. Sanjay Kumar గారి అనుచరుడిగా భావించే బత్తిని సంతోష్ కిరాతకంగా హత్య చేయటం యావత్ JAGTIAL జిల్లా Congress శ్రేణులను ఆందోళనకు గురి చేసిందని చెప్పకతప్పదు. ఇట్టి దురదృష్టకరమైన పరిణామంతో ఒకవిధంగా, గత నాలుగు దశాబ్దాలుగా Congress Party తో ఉన్న అనుబంధాన్ని పెనవేసుకున్న నాలాంటి వారికి దిగ్భ్రాంతి కలిగించటంతోపాటు, తీవ్ర నిరాశ, నిస్పృహ, మానసిక వ్యధతో ఆందోళనకు గురికావటము జరుగుతుందని చెప్పకతప్పదు.
వాస్తవంగా ప్రస్తుతం రాష్ట్రంలో శాసన సభ సభ్యుల సంఖ్య 119 కి గాను, Congress Party 65 + C.P.I. 1 స్థానం మొత్తం 66 స్థానాలు కలిగి ఉండగా, A.I.M.I.M. పార్టీకి చెందిన 7 గురు సభ్యులను తటస్థులుగా భావించినా, B.R.S. 38 మరియు B.J.P. 8 స్థానాలతో మొత్తం 46 స్థానాలకు పరిమితం కాగా, Congress Party సమర్థవంతంగా, సుస్థిర పాలన అందిస్తుందని భావిస్తూ రాష్ట్రంలో ప్రజాదరణ పొందుతున్న తరుణంలో, అఖిల భారత Congress నాయకులు Sri. Rahul Gandhi గారి ఆలోచనలకు భిన్నంగా, గతంలో T.R.S ప్రభుత్వ హయాంలో ఏవిధంగా అప్పటి ముఖ్యమంత్రి K.C.R. గారు అప్రజాస్వామిక విధానాలతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటముతో ప్రజలలో అప్రతిష్టమూట కట్టుకోవటం జరిగిందో, ఇప్పుడు మనము కూడా, అదే K.C.R. బాటను అనుకరించటం ప్రజానీకంతోపాటు, విద్యావంతులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులందరు కూడా ఒకవిధంగా, ఆశ్చర్యానికి గురి అవుతున్నారని చెప్పకతప్పదు.
ఈ పరిస్థితులలో రాజకీయంగా ప్రజా జీవితంలో, నేను నమ్ముకున్న నా Congress Party నుండి నాకు ఇంత అగౌరవం, ఒకవిధంగా అవమానంగా భావిస్తున్న పరిస్థితులలో నా భవిష్యత్, కార్యాచరణ గురించి కూడా, నాకు మీరే మార్గదర్శకం చేయగలరని భావిస్తూ బాధాతప్త హృదయంతో..



