Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

ABVP భారీ ధర్నా..పరిస్థితి సీరియస్!!

Praveen Reddy Naredla, 16/06/202616/06/2026
Spread the love
     

ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న రేవంత్ సర్కార్…ABVP

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ABVP ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి శ్రావణ్ బి రాజ్ మాట్లాడుతూ” రాష్ట్రం రేవంత్ సర్కార్ ప్రభుత్వ విద్యావ్యవస్థను గాలికొదిలేసిందని, పేద విద్యార్థులకు విద్య దూరం చేసే కుట్రలో భాగంగానే స్కూళ్ల మూసివేతకు పూనుకున్నాడని, ఈ నిర్ణయాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేద,బడుగు వర్గాల విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25% సీట్లు అందించే విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, విద్యార్థుల తల్లి తండ్రుల రక్త మాంసాలను పీక్కుతుంటూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా మాఫియాపై చర్యలు తీసుకోవాలని, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి పేద విద్యార్థులకు ఫీజుల భారం నుండి ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు.


రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ” రేవంత్ రెడ్డి ప్రైవేట్,కార్పొరేట్ విద్యా మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని,ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం అన్నారు.ఇంజనీరింగ్, మెడిసిన్ ఫీజులను తలదన్నేలా పాఠశాలల ఫీజులన్న వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని,గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న MEO,DEO పోస్టులతో పాటుగా టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని,NEP 2020 అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని,పేద విద్యార్థుల కోసం కోట్లాడుతున్న విద్యార్థి పరిషత్ కార్యకర్తలపై పోలీసుల జులుం ఏంటని ప్రశ్నించారు. అక్రమంగా అరెస్టు చేసిన కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడే ప్రసక్తేలేదని విద్యార్థి పరిషత్ విద్యార్థుల పక్షాన్ని కోట్లాడుతుందని, రాబోవు కాలంలో రేవంత్ రెడ్డిని రాజకీయంగా బొంద పెడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిటీ సెక్రెటరీ పృథ్వీతేజ, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నీతూ సింగ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రాజు,మహేష్, దీపికా, శ్యామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సదా భరతమాత సేవలో

మాచెర్ల రాంబాబు
రాష్ట్ర కార్యదర్శి
9705665810


Spread the love
     
 
      
Telangana News abvpAkhil bharatiya Vidyarthi ParishadCommissionerate of School education boardMacherla rambabushravan rajState secretary

Post navigation

Previous post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ABVP భారీ ధర్నా..పరిస్థితి సీరియస్!!
  • BJYM స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా నరెడ్ల ప్రవీణ్ రెడ్డి
  • ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషనలో కంప్లైంట్ చేసిన శ్రీకాంత్
  • ముదిగంటి జితేందర్ రెడ్డి వర్ధంతి నేడు!!
  • మోడీజీ మన్ కీ బాత్ –Modi ji Mann ki baat

Recent Comments

  1. Vrr on బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…
  2. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  3. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. Madhu on కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • Health
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | Terms & Conditions | Privacy Policy | Disclaimer