
భారతీయ జనతా పార్టీ యువజన విభాగం BJYM రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నరెడ్ల ప్రవీణ్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ప్రకటించారు.
ఈ సందర్బంగా నరెడ్ల ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ BJYM రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు గారికి,కేంద్రమంత్రి బండి సంజయ్ గారికి,జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి గారికి,సంఘ్ పరివార్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్ధి,నిరుద్యోగ వ్యతిరేక విధానాలను ఎండగడతూ యువత పక్షాన కొట్లాడుతానని,యువతకు బీజేవైఎం పరంగా అండగా ఉంటామని అన్నారు.
నరెడ్ల ప్రవీణ్ రెడ్డిది స్వస్థలం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చిన్నపాపయ్య పల్లె గ్రామం.







M.tech పూర్తి చేసిన నరెడ్ల ప్రవీణ్ రెడ్డి గతంలో ఏబీవీపీ 10 సంవత్సరాలు పూర్తి సమయ కార్యకర్తగా పని చేశారు.2010 నుండి 2020 వరకు ABVP లో క్రియాశీలకంగా పని చేసారు.విజయవాడ సిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా,ఖమ్మం ఉమ్మడి జిల్లా విభాగ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా,వరంగల్ ఉమ్మడి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీగా,హైదరాబాద్ సిటీ టెక్నీకల్ సెల్ కన్వీనర్ గా,స్టేట్ టెక్నీకల్ సెల్ కన్వీనర్ గా,ABVP జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పని చేసారు.








BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా,భూపాలపల్లి జిల్లా ఇంచార్జ్ గా,మంచిర్యాల అసెంబ్లీ ఇంచార్జ్ గా,వరంగల్ పశ్చిమ ఇంచార్జ్ గా,కరీంనగర్ అసెంబ్లీ మెంబర్షిప్ సహ ఇంచార్జ్ గా,కరీంనగర్ జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ ఇంచార్జ్ గా పని చేసారు.గత డిసెంబర్ లో భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు కరీంనగర్ నుంచి తెలంగాణ నుంచి గుజరాత్ వరకు జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ మార్చ్ లో పది రోజుల పాటు వివిధ రాష్ట్రాల మీదుగా యూనిటీ మార్చ్ లో పాల్గొన్నారు.


ప్రస్తుతం BJYM రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికయ్యారు.వారికి పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
