బండి సంజయ్ దెబ్బకు దిగొచ్చిన గుంపు మేస్త్రీ🔥

బండి సంజయ్ బరిలోకి దిగితే తాడో పేడో తేలుడే అన్నట్టు ఉంటది..
బండి సంజయ్ పిలిపిస్తే సమస్య పరిష్కారమైనట్టే..
అట్లుంటది మరి బండి సంజయ్ తోటి..

అసలు విషయం ఏమిటంటే సిరిసిల్ల నేతన్నలకి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ,ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇవ్వాల్సిన బిల్లులు ఇయ్యక,నేతన్నలకి పూట గడవక అవస్థలు పడుతున్నారు..
వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించినా,మాజీ మంత్రి కేటీఆర్ కి చెప్పుకున్నా సమస్య పరిష్కారం కాలేదు..

గత నాలుగు రోజుల కింద లక్ష్మీనారాయణ అనే నేతన్న అప్పుల భారం మోయలేక,కుటుంబాన్ని సాధలేక,ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు రాకపోయిన దిక్కుతోచని పరిస్థితిలో లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు..

సిరిసిల్ల ఎమ్మెల్యే,మాజీ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ గారి సొంత నియోజకర్గంలోనే నేతన్నలకు సాయం చేయలేదు.BRS ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వాల్సిన బకాయిలను అప్పుడే విడుదల చేస్తే ఈ పరిస్తితి రాపోవు..

ఇప్పుడున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం,బకాయిలు విడుదల చేయకపోవడం వలన నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు 50 వేల సాయం చేస్తే ఎంపీ బండి సంజయ్ గారు చలించి వెంటనే లక్ష రూపాయల సాయం అందించారు..

అదే రోజు నేతన్నల కోసం ఈ నెల 1Oవ తేదీన సిరిసిల్ల లోనే దీక్షకి పిలుపిచ్చాడు.

తక్షణమే బకాయిపడ్డ 270 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని,నేతన్నలకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చి ఆదుకోవాలని,విద్యుత్ సబ్సిడీని పునరుద్ధరించాలని,యార్న్ సబ్సిడీ ఇవ్వాలని,వర్క్ టు ఓనర్ పథకాన్నీ కొనసాగించాల్సిందేననే డిమాండ్లతో దీక్షకు దిగుతానని హెచ్చరిండం నేడు గుంపు మేస్త్రీ సర్కార్ దిగొచ్చింది..వెంటనే నేతన్నలతో చర్చలు జరిపి ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది..

ఎంతైనా మాస్ లీడర్ మాస్ పబ్లిక్ లోకి వెళితే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కారం అవుతుందని బండి ప్రూవ్ చేశాడు..

ప్రభుత్వం దిగిరావడం బండి సంజయ్ వల్లేనని నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

జై హింద్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *