ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని మొత్తుకుంటారు..కానీ వీళ్ళెప్పుడూ కలవరు..కలవనివ్వరు..కల లోకూడా కానివ్వరు..
1925 లో CPI అరువు తెచ్చుకున్న కమ్యూనిస్టు సిద్ధాంతం తో పుట్టింది..
మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళకే సిద్దాంతాలు నచ్చకనో,వ్యక్తులు నచ్చకనో రష్యా మద్దతుదారులుగా,చైనా మద్దతుదారులుగా(భారత మద్దతుదారులుగా కాదు) చీలిపోయి CPI(M) అని చైనా చెంచాలుగా పుట్టింది..
ఇగ తర్వాత తర్వాత అనేక పార్టీలుగా కుక్కలు చింపిన విస్తరిలెక్క చీలిపోయి అనేక సంఘాలుగా మారిపోయాయి..
చైనా లో వాన వస్తే భారత్ లో గొడుగు పట్టే బ్యాచ్ గా తయారయ్యిళ్ళు..
ఎప్పుడో చీలిపోయిన వీరి పార్టీలు ప్రతీ మే 1 న ఎర్రి జెండాలు పట్టుకొని ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని అంటారు..ఎన్ని మే లు పోయినాయి..మరి మీ పార్టీలు ఎందుకు కలవయి..ఒక్కటిగా ఎందుకు నిలవయి..?
పీడిత తాడిత జనాల కోసమంటూ నిత్యం నినాదాలు ఇచ్చే వీళ్ళ పోలిట్ బ్యూరో సభ్యులుగా మాత్రం వీళ్ళని గుర్తించరు..
అగ్రవర్ణాల రాజ్యం,అగ్రవర్ణాల దోపిడీ అంటూ నిత్యం విమర్శించే వీరి పార్టీ,సంఘాల నేతలు మాత్రం అగ్రవర్ణాలే ఉంటరు..
విమర్శించడానికి,విరుచుకుపడడానికి తప్ప చెప్పింది ఆచరించడానికి చేత కాదు..
మే డే రోజు కార్మికుల గురించి మాట్లాడే ఇవే పార్టీల పత్రికలలో పని చేసే వాళ్ళని కరోనా సమయంలో పీకేశారు..జీతాలు కూడా కట్ చేసారు..
ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో..ఎన్నెన్నో..చెప్పేవి ఒకటి..చేసేది ఒకటి..వీళ్ళ కాలం చెల్లిన సిద్ధాంతాలను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోరు.. అట్లుంటది కమ్యునిస్టులతోని🤣🤣
అయినా సిగ్గులేకుండా ఇంకా గట్టిగా మొత్తుకోండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని…😂😂😂
(సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి రోజునే అసలైన కార్మిక దినం)
నరెడ్ల ప్రవీణ్ రెడ్డి
MAYDAY SHOULD BE CANCELED AND 17TH SEPTEMBER OF EVERY YEAR SHOULD BE DECLARED AS VISWAKARMA DAY [LABOUR DAY].