శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఆపరేషన్ సింధూర్ పై వివాదం ముగియక ముందే మరో కొత్త వివాదం లో చిక్కుకుంది.

ఒకవైపు ప్రొఫెసర్ గా,రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులుగా కొనసాగుతున్న సుజాత 2018 ఎన్నికల్లో BSP పార్టీ తరుపున కండువా వేసుకొన్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది..ఉద్యోగంలో కొనసాగుతూ ఇలా పార్టీ కండువాలు వేసుకోవడం రూల్స్ ని అతిక్రమించినట్టే కదా..మరి ప్రభుత్వం ఎలా సుజాతను విద్యా కమిషన్ సభ్యులుగా కొనసాగిస్తున్నది అంటూ నెటిజనం ప్రశ్నిస్తున్నారు!
ఇప్పటికే విద్యా కమిషన్ పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి..అర్బన్ నక్సలైట్లకు విద్యా కమిషన్ లో చోటివ్వడం ఏంటి అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇదవరకే రేవంత్ రెడ్డి సర్కార్ ని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే!
మరిప్పుడు ఏకంగా పార్టీ కండువా కప్పుకొని ఉద్యోగం చేస్తున్న సుజాత పై చర్యలు ఉంటాయా? వేచి చూడాల్సిందే!!