వందేమాతరం గేయాన్ని అడ్డుకోవడంపై VHP నేత బాలస్వామి ఫైర్
వందేమాతరం గేయాన్ని అడ్డుకోవడం దేశభక్తి భావాలను అవమానించడమే: VHP ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి
సోనియా గాంధీ వ్యవహారంపై దేశ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి
దేశభక్తి, వందేమాతరం గేయం విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టం చేయాలి
ఈ దేశంలో ఉండాలంటే పూర్తి వందేమాతరం పాడాల్సిందే..!
వందేమాతరం గేయాన్ని ఆపడం ఎవరి తరం కాదని తీవ్ర ఆగ్రహం
ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి భారత సాంస్కృతిక వైభవానికి పాటుపడాలని హితవు
పూర్తి వందేమాతరం గేయాన్ని పాడకుండా మధ్యలోనే అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి తగదని, వెంటనే భారతీయులందరికీ ఆమె క్షమాపణ చెప్పాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయులు జాతీయ గీతంతో పాటు జాతీయ గేయం వందేమాతరంను అత్యంత భక్తిశ్రద్ధలతో స్మరిస్తున్న సమయంలో, కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పూర్తి వందేమాతరం గేయాన్ని ఆలపించే సందర్భంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేయడం తీవ్రంగా కలిచి వేసిందని విశ్వహిందూ పరిషత్ బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత స్వాతంత్ర్యోద్యమంలో కోట్లాది మంది దేశభక్తులకు స్ఫూర్తి నింపిన గేయం వందేమాతరం అన్నారు. కోట్లాదిమంది ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చి జాతీయ చైతన్యానికి ప్రతీక అయిన వందేమాతరం గేయాన్ని అవమానించడం కాంగ్రెస్ పార్టీకి తగదన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులకు వందేమాతరం తారకమంత్రంగా నిలిచిందన్నారు.
దేశ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో భారత జాతీయ గేయాన్ని పూర్తి రూపంలో ఆలపిస్తున్న సమయంలో దానిని నిలిపివేయాలని ప్రయత్నించడం కోట్లాది భారతీయుల దేశభక్తి భావాలను అవమానించడమేనని బాలస్వామి అన్నారు.
అసలు దేశభక్తి విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వందేమాతరం విషయంలో రాజకీయ లాభనష్టాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, మతపరమైన బుజ్జగింపులకు తావివ్వడం దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రను అవమానించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో వందేమాతరం ఒక మహత్తరమైన జాతీయ నినాదంగా ప్రజలను ఏకం చేసిందని, అలాంటి జాతీయ గేయాన్ని స్వాతంత్ర్య దినోత్సవం రోజునే అవమానించే పరిస్థితి రావడం దురదృష్టకరం అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వందేమాతరం పూర్తి గేయాన్ని పాడటానికి ఎవరికీ అభ్యంతరం ఉండకూడదని, భారతదేశాన్ని మాతృభూమిగా భావించే ప్రతి భారతీయుడూ జాతీయ గేయానికి గౌరవం ఇవ్వాలని ఆయన అన్నారు.
సోనియా గాంధీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వివరణ ఇవ్వాలని, జాతీయ గేయం పట్ల తమకు ఉన్న గౌరవాన్ని బహిరంగంగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ నేత బాలస్వామి డిమాండ్ చేశారు.
“వందేమాతరం విషయంలో భారతీయుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను విశ్వహిందూ పరిషత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. దేశభక్తి, జాతీయ గౌరవం విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. వందేమాతరం భారతీయుల గుండె చప్పుడు — దానిని ఆపే హక్కు ఎవరికీ లేదు. ఈ దేశంలో ఉండాలంటే పూర్తి వందేమాతరం పాడి తీరాల్సిందే” అని బాలస్వామి స్పష్టం చేశారు.
భవదీయ

పగుడాకుల బాలస్వామి
ధర్మాచార్య సంపర్క ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్
తెలంగాణ
9912975753
9182674010
