Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

ఎంపీ లాడ్స్‌ నిధుల వినియోగంపై దుష్ప్రచారం సరికాదు: బండి సంజయ్

Praveen Reddy Naredla, 01/09/202601/09/2026
Spread the love
     

ఎంపీ లాడ్స్‌ నిధుల వినియోగంపై దుష్ప్రచారం సరికాదు: బండి సంజయ్

కరీంనగర్: ఎంపీ లాడ్స్‌ నిధుల వినియోగంపై ‘ఎంపవర్డ్ ఇండియన్’ సంస్థ విడుదల చేసిన నివేదిక వాస్తవాలకు విరుద్ధంగా ఉందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని, పరిపాలనాపరమైన ప్రక్రియలను పరిగణనలోకి తీసుకోకుండా ఎంపీలపై ఆరోపణలు చేయడం బాధాకరమని ఆయన అన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి తనకు కేటాయించిన రూ.17.50 కోట్లలో ఇప్పటికే రూ.16.47 కోట్లు (94.1 శాతం) అభివృద్ధి పనులకు వినియోగించినట్లు బండి సంజయ్ తెలిపారు.

627 పనులకు ప్రతిపాదనలు

పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, బోర్‌వెల్స్‌ తదితర అభివృద్ధి పనుల కోసం 627 పనులకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వెల్లడించారు. వీటిలో ఇప్పటికే 82.29 శాతం పనులకు కలెక్టర్ల ఆమోదం లభించిందని తెలిపారు. ప్రతిపాదన నుంచి పనులు పూర్తయ్యే వరకు వివిధ పరిపాలనాపరమైన దశలు ఉంటాయని, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నిధుల వినియోగంపై అంచనాలు వేయడం సరికాదని పేర్కొన్నారు.

అంతేకాకుండా, గత ఎంపీ వినియోగించకుండా వదిలేసిన రూ.2.5 కోట్ల నిధులను కూడా ప్రజా అవసరాల కోసం తామే ఖర్చు చేసినట్లు బండి సంజయ్ తెలిపారు.

నిధులు సరిపోవడం లేదు

స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీ లాడ్స్‌ నిధులు సరిపోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీ లాడ్స్‌ నిధులను పెంచాలని పలువురు ఎంపీలు కేంద్రాన్ని కోరుతున్నారని చెప్పారు.

అభివృద్ధి పనులు నిధుల కొరతతో నిలిచిపోకూడదనే ఉద్దేశంతో అదనంగా CSR నిధులను సేకరించి ప్రజా అవసరాలకు వినియోగిస్తున్నామని బండి సంజయ్ వివరించారు.

వాస్తవాలను మాత్రమే ప్రజల ముందుంచాలి

‘ఎంపవర్డ్ ఇండియన్’ సంస్థ ఇకనైనా ఎంపీ లాడ్స్‌ నిధుల విషయంలో ప్రతిపాదన, ఆమోదం, పరిపాలనా ప్రక్రియ, పనుల ప్రారంభం, పూర్తయ్యే వరకు ఉండే దశలను పరిగణనలోకి తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.

ఎంపీలపై అనవసర ఆరోపణలు చేయకుండా, క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించి వాస్తవ సమాచారాన్ని మాత్రమే ప్రజల ముందుంచాలని ఆయన సూచించారు.


Spread the love
     
 
      
News Telangana Bandi sanjayKarimnagarMpladsSurvey

Post navigation

Previous post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ఎంపీ లాడ్స్‌ నిధుల వినియోగంపై దుష్ప్రచారం సరికాదు: బండి సంజయ్
  • దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం: బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి
  • హైదరాబాద్‌లో నర్సు దారుణ హత్య.. మృతదేహంపై అత్యాచారం జరిగినట్లు అనుమానాలు
  • ఇరుముడి సినిమా పేరుకు..కథకు పొంతన ఎక్కడ?
  • అమెరికా పర్యటనలో RSS చీఫ్ మోహన్ భాగవత్ జీ!!

Recent Comments

  1. raju on 2014 నుంచి మోడీ ప్లానింగ్ కి హాట్సాఫ్
  2. Vrr on బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…
  3. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥

Archives

  • September 2026
  • August 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • Health
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | WordPress Theme by SuperbThemes