బండి సంజయ్ కాళ్ళ మీద పడ్డ కేటీఆర్..సోషల్ మీడియాలో ఫుల్ వైరల్..
తెలంగాణ రాజకీయాల్లో ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం, తిట్టుకోవడం,బూతులు తిట్టుకోవడం,ప్రెస్ మీట్లు పెట్టి
ఛాలెంజ్ లు విసురుకోవడం కూడా మనం ఎప్పటినుంచో చూస్తున్నాం..అయితే కొన్నేళ్లుగా ట్రెండ్ మారింది..సోషల్ మీడియా ట్రెండ్ వచ్చాక మీమ్స్,ట్రోల్స్,కామెంట్స్,కౌంటర్లు అన్ని ఫోన్ లోనే..
ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా పోయి చాట్ జీపీటీ,ఏఐ జెమిని మొదలగు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వచ్చాక మొత్తం మారిపోయింది..ఇంకా రాజకీయంలో చూస్తే లేనిది ఉన్నట్టు..ఉన్నది లేనట్టు చూపించే పరిస్థితి వచ్చింది..
అసలు విషయం ఏంటి అంటే ఈ మధ్యన జాతీయ బీజేపీ నాయకత్వం తెలంగాణ ఎంపీలను,ఎమ్మెల్యేలతో వరుస భేటీలు,ఒకరి ఇంట్లో విందు ఏర్పాటు చేస్తే అందరూ కలిసి పాల్గొనడం,ఒక్క తాటిపై నడుస్తున్నట్టుగా కనపడుతుంది..దానిలో భాగంగానే మొన్న ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో విందు ఏర్పాటు చేస్తే తెలంగాణ నుంచి గెలిచిన ఎంపీలు,రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కూడా హాజరయ్యు భోజన అనంతరం ఒక గ్రూప్ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.ఇది విపరీతంగా వైరల్ అవ్వడం,కార్యకర్తలంతా సంతోషం వ్యక్తం చేయడం చక చకా జరిగిపోయింది.
అయితే బీజేపీ తెలంగాణ ఎక్స్(గతంలో ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్ట్ చేయగా..తగుదునమ్మా అంటూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా టీమ్ మధ్యలో దూరింది.వారి పార్టీ ఎక్స్ హ్యాండిల్ నుండి బీజేపీ ఎంపీలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీజేపీ ఎంపీలతో కలిసి ఉన్నట్టు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ AI ఇమేజ్ క్రియేట్ చేసి తెలంగాణ బీజేపీ ముఖ్యమైన వ్యక్తి రేవంత్ రెడ్డిని ఎలా మిస్ చేస్తారు అంటూ వెటకారాన్ని,వ్యంగ్యాన్ని దట్టించి బీజేపీ తెలంగాణ పోస్ట్ ను కోట్ చేస్తూ బీఆర్ఎస్ పోస్ట్ పెట్టింది.ఇగ మేము మస్తు ట్రోల్ చేసినం అని జబ్బలు చరుచుకుని సంబరపడ్డది బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్..మాకు తిరుగులేదు..మమ్మల్ని సోషల్ మీడియాలో కొట్టేటోడు లేదు అనుకున్నట్టున్నారు..ఇంతలోనే

చిర్రెత్తుకొచ్చిందేమో కాంగ్రెస్ వాళ్లకు..వాళ్ళు మేమేమన్నా తక్కువతిన్నామా అంటూ బండి సంజయ్ కాళ్ళ మీద కేటీఆర్ పడి పడుకున్నట్టు,ప్రాధేయపడినట్టు ఒక ఏఐ ఇమేజ్ క్రియేట్ చేసి నెట్టింట వదిలి ఘాటుగా కౌంటర్ పోస్ట్ పెట్టేసరికి ఇప్పుడు ఈ సెటైర్ పేలి ఫుల్ వైరల్ అవుతుంది..

బీఆర్ఎస్ పెట్టిన వ్యంగ్య పోస్ట్ బూమరాంగ్ అయ్యి వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకున్నట్టు అయింది..ఇప్పటి రాజకీయానికి కంటి చూపుతో చంపుకోవడాలు,కత్తులతో పొడుచుకోవడాలు,కోట్ల రూపాయలు పెట్టి సభలు పెట్టి తిట్టుకోవడాలతో పని లేకుండానే చెప్పాలనుకున్నది సుత్తి లేకుండా సూటిగా మీమ్స్ తో కొట్టే రోజులొచ్చాయి..అందుకే సంబంధం లేనిదాంట్లో దూరొద్దు అని అనేది..
ఇక్కడే ఇంకో చర్చనీయాంశమైన అంశం చెప్పుకుందాం..నిన్న ఎక్కడో సభలో పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ మాట్లాడుతూ ఫారిన్ పాలసీ అంటే మోడీ అవసరం లేకుండానే వాటేసుకోవడాలంటూ..ఎత్తిపొడుస్తూ..ఎద్దేవాచేస్తూ షీలా దీక్షిత్ కొడుకును జుగుప్సాకరంగా కౌగిలించుకొని ఇటలీ ప్రధాని జార్జి మెలోని,మోడీకి లింక్ పెడుతూ రాహుల్,దీక్షిత్ షో చేయడం ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అయిపోయింది..దీనికి బీజేపీ ఊరుకుంటుందా..ఘాటుగానే దిమ్మతిరిగేతట్టు కౌంటర్ పోస్టులు కుమ్మేసింది..గతంలో ఇందిరాగాంధీ,ఫిడెల్ క్యాస్ట్రో కౌగిలించుకున్న ఫోటోలను,వీడియోలను వదిలింది..దీనితో పాటు జవహర్ లాల్ నెహ్రు సిగరెట్ తాగుతూ మహిళలను కౌగిలించుకున్న ఫొటోస్,రాజీవ్ గాంధీ ఇతర దేశాల ప్రధానులను కలిసిన కౌగిలింతల ఫోటోలు కూడా పెట్టి రాహుల్ ను ఏకిపారేసింది బీజేపీ..
రాహుల్ నిజంగానే పప్పు అని పరిపక్వత లేని రాజకీయ నాయకుడు అని సంస్కారం లేని వ్యక్తి అంటూ నెటిజనులు కూడా విమర్శలు కురిపిస్తున్నారు..ఇది విషయం!!
https://twitter.com/N_RamchanderRao/status/2087939411468226972/video/1?s=46
బీజేపీ కౌంటర్లు::
గతంలో రాహుల్ తాత,నానమ్మ,తండ్రి,మన్మోహన్ సింగ్ గారి విదేశీ పర్యటనలో వారు వ్యవహరించిన తీరు ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
చిన్నపిల్లాడి వేషాలు వేస్తూ ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన హుందాతనం లేకుండా సిల్లీగా వ్యవహరిస్తున్నాడని ప్రజలు భావిస్తున్నారు..ఇది ఈరోజు ట్రెండింగ్ లో ఉన్న చర్చనీయాంశాలు..
