వందేమాతరాన్ని పాడకుంటే ఇటలీ వెళ్లిపోండి..
వందేమాతరాన్ని పాడకుంటే ఇటలీ వెళ్లిపోండి..
మొన్న స్వాతంత్ర్య దినోత్సవాన వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించకుండా ఆపాలని పిలుపునిచ్చిన సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,ఖర్గే లకు వ్యతిరేకంగా భారతీయ జనతా యువ మోర్చా(BJYM) ఆధ్వర్యంలో కరీంనగర్ కోర్టు చౌరస్తాలో నిరసన తెలియజేసి అనంతరం పూర్తి వందేమాతర గేయాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా BJYM రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్లు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు వందేమాతరం పాడడాన్ని అడ్డుకుంటుందని,అవమానిస్తోందని అన్నారు.
ఈ దేశంలో పుట్టిన ప్రతీ ఒక్కరు వందేమాతరం పాడాల్సిందే అని,రాజ్యాంగం ప్రకారం,పార్లమెంట్ లో బిల్లుగా మారిన పూర్తి వందేమాతరాన్ని తప్పకుండా పాడాలని అన్నారు.పాడడం ఇష్టం లేకపోతే ఈ దేశం విడిచి వేరేదేశాలకు వెళ్ళిపోవాలని హెచ్చరించారు.
దేశానికి స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా వందేమాతర నినాదమే పోరాటానికి ఊపిరి పోసిందని,ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే అని అన్నారు.
ఒకవైపు భారతదేశానికి ప్రపంచమంతా కొలుస్తుంటే..భారత్ మాతాకి జై అనం,వందేమాతరం పాడం అంటే ఇక్కడ నడవదన్నారు.
ఇది దేశంకోసం బలిదానమైన అమరవీరులను,పోరాటయోధులను,సైనికులను,ప్రజలను అందరినీ అవమానించినట్టే అవుతుందని అన్నారు.ఇప్పటికే దేశద్రోహ చర్యలతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారానికి దూరంగా ఉంచారని,ఇలాంటి చర్యలతో మొత్తం కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు..

BJYM కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సంగ నరేష్ మాట్లాడుతూ ఒకవైపు దేశమంతా 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్న వేళ,150 ఏళ్ల వందేమాతర ఉత్సవాలు జరుగుతున్న సమయంలో,పార్లమెంట్ లో బిల్లు పాస్ అయి చట్టం అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ,రాహుల్ గాంధీ,ఖర్గేలు వందేమాతర గేయాన్ని ఆపాలని పిలుపునివ్వడం సిగ్గుచేటు అన్నారు.పూర్తి వందేమాతరం పాడడం మీకు ఎందుకు ఇబ్బంది అవుతుందని ప్రశ్నించారు.ఇప్పటికే వెంటిలేటర్ పై ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని,ఇలా చట్ట వ్యతిరేఖ,దేశ వ్యతిరేక కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎవరూ నమ్మరని ఘాటుగా విమర్శించారు.

బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సోనియా గాంధీ,రాహుల్ గాంధీలు వందేమాతర గేయాన్ని అవమానించడం సరికాదు అని,ఈ దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరు వందేమాతరం పాడాల్సిందే అని,ఇష్టం లేపోతే ఈ దేశాన్ని విడిచివెళ్లాలని అన్నారు.ఇలాంటి దేశద్రోహ చర్యల వల్ల కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుందని,ప్రజలే గట్టి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ జితేందర్,జగన్ రెడ్డి,బీజేవైం నాయకులు శశిధర్ రెడ్డి,
కుమార్,ప్రమోద్,వెంకటేష్,చైతన్య,దేవాగౌడ్,ప్రదీప్,రాజేందర్,వినయ్,శేఖర్, రమేష్ యాదవ్,రావుల కిరణ్,వినయ్,నాగరాజు,గడ్డం సందీప్,జాగిరి రాజేందర్,కార్తీక్,శ్రీకాంత్ నాయక్,శ్రీనివాస్ నాయక్,సిద్దు,అంజి,మద్ది రాకేష్ తదితరులు పాల్గొన్నారు

